నటన విషయంలో తల్లికి తగ్గ తనయుడని అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు . అలనాటి నటి షర్మిళా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ల కుమారుడు సైఫ్. తన తల్లిలాగే సైఫ్ కూడా సినిమాల్లో రాణించాలని అనుకున్నారు. అలా 1993లో వచ్చిన ‘పరంపర’ సినిమాతో తన బాలీవుడ్ కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తాజాగా సైఫ్ నటించిన చిత్రం ‘లాల్ కప్తాన్’. నవదీప్ సింగ్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ నాగ సాధు గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటివరకు సైఫ్ ఇలాంటి పాత్రలో నటించింది లేదు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ట్రైలర్‌లో ముఖానికి బూడిద, నుదుటిపై నామంతో ఉన్న సైఫ్ గెటప్‌ను చూపించారు.‘మనిషి పుట్టినప్పుడే అతని మరణం గురించి పైవాడు రాసేసి ఉంటాడు’ అన్న డైలాగ్ చెప్తూ మనుషుల్ని దారుణంగా చంపి, గుర్రానికి కట్టి ఈడ్చుకెళుతున్నట్లుగా సైఫ్ ఇందులో కనిపించారు. ఇందులో సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో కనిపించనున్నారు. మానవ్ విజ్, జోయా హుస్సేన్, దీపిక్ డోబ్రియల్, సిమోన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఇదో ఎపిక్ యాక్షన్ డ్రామా. సైఫ్ గొప్ప నటుడు. ఈ చిత్ర కథ ఆయనలోని కొత్త నటుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. భారతీయ వెండితెరపై ఓ కొత్త పంథాలో నడిచిన చిత్రంగా నిలిచిపోతుంది’ అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దంలో ఓ బ్రిటీష్ కెప్టెన్‌పై పోరాడిన నాగసాధువు కథ ఇది. ఇలాంటి పాత్రలో సైఫ్ నటించడం ఇదే తొలిసారి కాబట్టి ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రొటీన్ కాన్సెప్ట్స్‌నే కాకుండా సైఫ్ కాస్త భిన్నమైన కథలను ప్రయత్నిస్తున్నారు. ఆయన నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రస్తుతం సైఫ్.. ‘తానాజీ ది అన్‌సంగ్ హీరో’, ‘దిల్ బిచారా’, ‘జవానీ జానేమన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
from https://ift.tt/2mifLHp
No comments:
Post a Comment