పూరి పుట్టినరోజుకి ఛార్మి సర్ప్రైజ్...ఏంటో తెలుసా? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 25 September 2019

పూరి పుట్టినరోజుకి ఛార్మి సర్ప్రైజ్...ఏంటో తెలుసా?

ఛార్మి అండ్ పూరి..ఇప్పుడు ఈ కాంబినేషన్‌కి టాలీవుడ్ లో సూపర్ హైప్ ఉంది. ఇస్మార్ట్‌ శంకర్ ముందు వరకు వీళ్ళను ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమా హిట్ అవ్వడం కాదు ఏకంగా బ్లాక్ బస్టర్ అనిపించేసుకుంది. దాంతో ఇప్పుడు పూరి కనెక్ట్స్‌తో కనెక్ట్ అవ్వడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్లలో ముందుగా విజయ్ దేవరకొండ మంచి ఛాన్స్ దక్కించుకున్నాడు. ఫామ్‌లోకి వచ్చిన పూరితో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి పూరి డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. ఛార్మి కూడా ప్రొడ్యూసరే. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్‌లో స్టార్ట్ అవుతుంది. సమ్మర్ ఎండింగ్‌లో రిలీజ్ అవుతుంది. అయితే ఈలోగా పూరి పుట్టినరోజుకే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఛార్మి కౌర్. పూరి పుట్టినరోజున మామూలు సర్ప్రైజ్ కాదు ఏకంగా ఒక ధమాకా ప్లాన్ చేసిందట. అదేంటో గెస్ చెయ్యండి అంటూ ఒక అప్డేట్ కూడా పెట్టింది. ''మన డియరెస్ట్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇస్మార్ట్ స్పెషల్ సర్పైజ్ రాబోతుంది'' అంటూ ఒక పోస్ట్ పెట్టింది. కానీ ఆ పోస్ట్ ఏంటి అనేది రివీల్ చెయ్యకుండా గెస్ చెయ్యమంటుంది. అయితే ఆ పోస్ట్‌లో ఇస్మార్ట్ అని మెన్షన్ చేసింది కాబట్టి పూరి ముందు చెప్పినట్టు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఏమైనా అనౌన్స్ చేస్తాడా? అనే డౌట్ కూడా వస్తుంది. Also Read: ఇప్పటికే ఆ సీక్వెల్ కి సంబంధించి ఒక ఐడియా కూడా ఉంది అన్నారు. మామూలుగానే పాదరసంలా ఫాస్ట్‌గా పనిచేసే పూరి మైండ్ ఇప్పుడు సక్సెస్ కిక్ తో మరింత షార్ప్‌గా ఆలోచిస్తుంది. అందుకే ఈ షార్ట్ గ్యాప్‌లోనే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌కి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేశాడా?, తన పుట్టినరోజున ఆ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారా? అనేది ఫస్ట్ గెస్సింగ్ పాయింట్. ఎందుకంటే రామ్ కూడా ఇంకా తన తదుపరి సినిమా ఓకే చెయ్యకుండా, తన DP కూడా మార్చుకోకుండా వెయిట్ చేస్తున్నాడు. సో, అలా చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనౌన్స్ చెయ్యడానికే ఎక్కువ స్కోప్ ఉంది. Also Read: పూరి ఇప్పుడు వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు.అందుకే పైసా వసూల్ సినిమాతో బాలయ్యకి తేరుకోలేని డిజాస్టర్ కట్టబెట్టిన పూరి ఈ సారి మాత్రం హిట్ అందిస్తా అంటున్నాడు. గతంలో ఎన్టీఆర్‌కి కూడా ముందు ఆంధ్రావాలా అనే డిజాస్టర్ సినిమా ఇచ్చినా కూడా మళ్ళీ టెంపర్‌తో తారక్‌ని హిట్ ట్రాక్ మీదకి తెచ్చాడు. మళ్ళీ ఈ సారి కూడా నందమూరి హీరోకి మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడు అని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. పైసా వసూల్‌లో తేడాసింగ్ గా బాలయ్యను చూపించడంతో సినిమా మొత్తం తేడా కొట్టేసింది. అందుకే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలేదు. ఒక వేళ పూరి పుట్టినరోజుకి ఆ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. Also Read: విజయ్ దేవరకొండతో 2020 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఫైటర్ సినిమాకి సూపర్ ఫాస్ట్ పూరి ఇప్పుడే ఏదైనా టీజర్ లాంటిది వదులుతాడా అనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ ఈ మధ్య కంటిన్యూగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సో, పూరి అనుకున్నా కూడా అప్పుడే ఫైటర్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చే అవకాశం లేదు. పోనీ ఇస్మార్ట్ శంకర్‌కి ఫుల్లుగా లాభాలు రావడంతో ఛార్మి పూరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తుందా అనుకుంటే మొన్నే ఇద్దరూ కూడా కలిసి రెండు లావిష్ అండ్ లక్సరీ కార్స్ కొనుక్కున్నారు. మరి ఛార్మి చెప్పిన సర్పైజ్ ఏంటి?...ఖచ్చితంగా వీటిలో ఒకటి మాత్రం ఉంటుంది. అదేంటి అనేది మాత్రం పూరి పుట్టినరోజు అయిన ఈనెల 28 నే తెలుస్తుంది. స్టే‌ట్యూన్డ్.


from https://ift.tt/2myiexA

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages