మెగాస్టార్ పాతికేళ్ళుగా తెరకెక్కించాలి అనుకుంటున్న మెగా ప్రాజెక్ట్ తొలితరం,తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. అదే 'సైరా' అనే ప్రెస్టీజియస్ సినిమాగా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అనే బూస్ట్ అందుకున్న రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమాపై ముందు నుండి వస్తున్న వివాదం మాత్రం సెటిల్ అవ్వలేదు. పైగా రోజు రోజుకి ఇంకా పెద్దదిగా మారుతుంది. ఇప్పుడు అది మరో మెట్టు ఎక్కి లీగల్ ఇష్యూగా మారింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న టైమ్‌లో ఈ గొడవ టీమ్‌కి తలనొప్పిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు'సైరా' కథపై వివాదం కూడా ఈ సినిమా మొదలుకాకముందే మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తియ్యడానికి పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో సినిమా స్క్రిప్ట్ తయారు చేసారు. 'ఖైదీ నెంబర్ 150' రిలీజ్ అయిన తరువాత పరుచూరి బ్రదర్స్ కథతో, 80 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తియ్యాలి అనుకున్నారు. కానీ బాహుబలి-2 సినిమా చూసిన తరువాత, దాని కలెక్షన్స్ చూసిన తరువాత రామ్ చరణ్ 'సైరా'ని పాన్ ఇండియా సినిమాగా తియ్యాలి అనుకున్నాడు. అందుకోసం కేవలం పరుచూరి వాళ్ళు రాసిన కథ సరిపోదు అని మూలాలనుండి అతని కథ తెలుసుకుని దాన్ని తెరకెక్కించాలి అని ఆ బాధ్యతలు సురేందర్ రెడ్డికి అప్పగించారు. ఆ మేరకు సురేందర్ రెడ్డి కూడా కర్నూల్ వెళ్లి అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరిగిన ప్రాంతాలు, పోరాటం జరిపిన ప్రదేశాలు తిరిగి, వాళ్ళ కుటుంబసభ్యులను కూడా కలిసి ఆ కథని ఒక కొలిక్కి తీసుకువచ్చారు. ఆ కథ గురించి వివరాలు చెప్పినందుకు ఉయ్యాలవాడ వంశస్థులు రాయల్టీగా డబ్బులు అడిగారు అని, మనిషికి కి 15 లక్షల వరకు ఇవ్వడానికి రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఒప్పుకున్నారు అని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఈ సినిమా గురించి, దాని బడ్జెట్ గురించి వార్తలు రావడంతో ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్న ఇద్దరు ఉయ్యాలవాడ వంశస్థులని రెచ్చగొట్టి మనిషికి 50 లక్షలు అడగమని చెప్పడంతో కూల్‌గా సెటిల్ అవ్వాల్సిన మ్యాటర్ కాస్త ఇలా రచ్చగా మారింది అని ఫిల్మ్ నగర్ టాక్. అలా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ అడగడంతోనే సైరా నిర్మాతలు అనుకున్న అమౌంట్ కూడా ఇవ్వకుండా ఆపారు అని చెప్పుకుంటున్నారు. అయితే ఆ వివాదం ఇప్పుడు కేసులవరకు వెళ్ళింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 'సైరా' సినిమా విడుదల సిద్దమయింది. అయితే ఆ సినిమా కథకు తమ నుండి వివరాలు అడిగి తీసుకుని సినిమా తీశారు కాబట్టి తమకు ఏకంగా 50 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ వంశంలోని అయిదో తరానికి సంబంధించిన 23 మంది కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 'సైరా' నిర్మాత రామ్ చరణ్ పై, చిరంజీవిపై కూడా కేసు పెట్టారు. ఆ కథకి 50 కోట్లు అనేది సాధారమణమైన డిమాండ్ కాదు, కానీ మరొక పక్క 'సైరా'కి సంబందించిన పెండింగ్ వర్క్ పూర్తిచేసుకుని సినిమా ప్రొమోషన్స్ కూడా మొదలుపెటాల్సి ఉంది. మరి మధ్యలో ఈ వివాదం చూస్తే సద్దుమణిగేలా లేదు. ఇది ఈ రోజు కాకపోయినా సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇబ్బందిగా మారేలా ఉంది. మరి ఈ వివాదాన్ని చిరంజీవి,రామ్ చరణ్ ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే '' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావిడిలో ఉన్నారు.
from https://ift.tt/34WRGId
No comments:
Post a Comment