Saaho Movie: నిర్మాతలు, దర్శకులకు ప్రభాస్ కృతజ్ఞతలు.. రుణపడి ఉంటామంటూ మెసేజ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 5 August 2019

Saaho Movie: నిర్మాతలు, దర్శకులకు ప్రభాస్ కృతజ్ఞతలు.. రుణపడి ఉంటామంటూ మెసేజ్

రెబల్ స్టార్, తెలుగు ప్రేక్షకుల డార్లింగ్ మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు. ఆగస్టు 30న ‘సాహో’ విడుదలవుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ సినిమాల విడుదల తేదీలను రీషెడ్యూల్ చేసుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులకు ప్రభాస్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఆగస్టు 30న వస్తోన్న ‘సాహో’కి దారిచ్చి తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులు అందరికీ చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ ‘సాహో’ టీం రుణపడి ఉంటుంది. మీ సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రేమ, గౌరవంతో..’’ అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేసేజ్ చూసిన ప్రభాస్ అభిమానులు ‘‘అందుకే నిన్ను డార్లింగ్ అంటారన్న’’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ‘సాహో’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని అంటున్నారు. వాస్తవానికి ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, అదే రోజున బాలీవుడ్‌లో ‘మిషన్ మంగళ్’, ‘బాట్లా హౌస్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటితో పోటీపడటం ఇష్టంలేక, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ‘సాహో’ విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చారు. దీంతో ఆగస్టు 30న తెలుగులో విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు తేదీలను మార్చుకున్నాయి. శర్వానంద్ ‘రణరంగం’ ముందుగానే ఆగస్టు 15న విడుదలవుతోంది. అలాగే అడివి శేష్ ‘ఎవరు’ కూడా ఆగస్టు 15నే విడుదల చేస్తున్నారు. ప్రభాస్ ఈ తేదీని ఖాళీ చేయడంతో వాళ్లు దాన్ని ఆక్రమించారు. ఒకందుకు ఇది కూడా వాళ్లకు మంచిదే. కానీ, ప్రభాస్ మాత్రం వాళ్లకు సహృదయంతో కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంత స్నేహపూర్వకంగా ఉంటానో మరోసారి తెలియజెప్పారు. కాగా, ‘సాహో’లో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ స్టైలిష్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ లుక్‌పై బాలీవుడ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. నీల్ చాలా అందంగా ఉన్నాడంటూ కొనియాడుతున్నారు. ‘సాహో’లో హీరో ప్రభాసే కాదు.. విలన్ నీల్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాడని ఒక్క లుక్‌తో చెప్పారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు.


from https://ift.tt/2YsYei9

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages