Kobbari Matta: ‘కొబ్బరిమట్ట’ ట్రైలర్.. అరాచకం అంటే చిన్నమాటే! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 8 August 2019

Kobbari Matta: ‘కొబ్బరిమట్ట’ ట్రైలర్.. అరాచకం అంటే చిన్నమాటే!

బహుషా తెలుగు సినిమా హిస్టరీలో ఇంత అరాచకమైన ట్రైలర్‌ను చూసి ఉండరు అంటే అతిశయోక్తికాదేమో. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 10న విడుదల విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ప్రోమోలు, సాంగ్స్, టీజర్స్‌ను విడుదల చేయగా.. అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో సంపూర్ణేష్ బాబు చెప్పిన 3. 27 నిమిషాల నిడివితో చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. తాజాగా గురువారం నాడు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా.. 3.12 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అరాచకానికి పరాకాష్టలా ఉంది. పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడుగా త్రిపాత్రాభినయంలో సంపూర్ణేష్ బాబు బర్న్ అయ్యాడు. ముగ్గురు భార్యలు, ముగ్గురు తమ్ముళ్లతో పాటు.. భార్యా భర్తలుగా కత్తి మహేష్, షకీలా జోడీ.. మూవీ పీఆర్ఓ ఏలూరు శ్రీను ఎమోషనల్ డైలాగ్.. సంపూర్ణేష్ బాబు యాక్షన్ సీన్స్.. పప్పు రుబ్బుతుంటే చెమట పప్పులో పడే ఎమోషనల్ ఎపిసోడ్.. సంపూ బ్రేక్ డాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సంపూర్ణేష్ బాబు జీపును పైకి లేపి గాలిపటంలో గింగిరాలు తిప్పడం పీక్స్ అనే చెప్పాలి. ఇక శివ లింగం దగ్గర ‘శంభో శివ శంభో’ పాటకు సంపూ వేస్తున్న స్టెప్పులు చూస్తే పొట్ట చెక్కలే. ఈ అరాచకపు ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.


from https://ift.tt/2KvJR2C

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages