Sai Pallavi ఫిదా జేసింది.. లిప్‌లాక్ సీన్లో నటించలేక.. సినిమా వదిలేసిన హీరోయిన్? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 18 July 2019

Sai Pallavi ఫిదా జేసింది.. లిప్‌లాక్ సీన్లో నటించలేక.. సినిమా వదిలేసిన హీరోయిన్?

సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్‌లు సాధారణం. కథ డిమాండ్ చేసిందనో లేదంటే.. ఆ సీన్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి అలా చేయాల్సి వచ్చిందనో హీరోయిన్లు సమాధానం ఇస్తుంటారు. హీరోయిన్లంటేనే ఎక్స్‌పోజింగ్, లిప్ లాక్ సీన్లు భావన కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఇదంతా కామన్ వ్యవహారంగా మారిపోయింది. కానీ అందర్నీ ఒకేలా చూడలేం. అందంతోనే కాకుండా.. అభినయంతోనూ ఆకట్టుకొని ప్రేక్షకుల్ని ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి.. ఎక్స్‌పోజింగ్, అసభ్య సన్నివేశాల్లో నటించడానికి దూరంగా ఉంటుంది. లిప్ లాక్ సీన్లలో నటించడానికి ఏమాత్రం ఇష్టపడని .. ఈ కారణంగా ఓ సినిమానే వదులుకుందట. విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో హీరోయిన్‌గా మొదట సాయిపల్లవిని సంప్రదించారట. ముద్దు సీన్లలో నటించడానికి తాను ఇబ్బంది పడతానని, అందుకే ఈ సినిమాలో చేయలేనని హీరోయిన్ వారికి చెప్పినట్టు సమాచారం. సాయిపల్లవి నో చెప్పడంతో.. ఆమె స్థానంలో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ విషయమై అటు సాయిపల్లవి కానీ, ఇటు చిత్ర యూనిట్ కానీ స్పందించలేదు. విజయ్-రష్మిక జంట నటించిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రెడ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకే చెప్పిన ఆమె.. రానా దగ్గుబాటితో కలిసి వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా పొలిటిషియన్‌గా, సాయిపల్లవి పేద యువతి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.


from https://ift.tt/2JMS2Hz

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages