‘Mr. కెకె’ ట్రైలర్.. కేక పెట్టించిన విక్రమ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 4 July 2019

‘Mr. కెకె’ ట్రైలర్.. కేక పెట్టించిన విక్రమ్

స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు . తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించిన చియాన్.. ‘Mr. కెకె’ అంటూ మరోసారి స్టైలిష్ యాక్షన్ లుక్‌లో దర్శనం ఇచ్చారు. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వం వహించిన ఈ మూవీ పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘కందరం కొండ‌న్’ అనే పేరుతో తమిళ్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘Mr. కెకె’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇండియ‌న్ జేమ్స్ బాండ్‌గా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ క‌థ‌ల‌కి, విభిన్న‌మైన పాత్ర‌ల‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు చియాన్ విక్ర‌మ్. ఇదే నేప‌థ్యంలో తాజాగా చియాన్ విక్ర‌మ్ మ‌రో హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్నారు. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ నిర్మాత‌గా, రాజేష్ ఎం సెల్వా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ మ‌రో సారి త‌న న‌ట విశ్వ‌రూపం చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్‌తో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించేదిగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో ఇదో సీరియ‌స్ యాక్ష‌న్ థ్రిల‌ర్ అనే క‌థ‌ను చెప్ప‌క‌నే చెప్పిన చిత్ర బృందం, ట్రైల‌ర్‌ను ఓ విజువ‌ల్ ఫీస్ట్ గా రెడీ చేశారు. క‌మ‌ల్ చిన్న త‌న‌య అక్ష‌ర హాస‌న్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఆమె చుట్టూనే సినిమా స్టోరీ ఉన్న‌ట్లుగా ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఇక మోడ్రన్ అండ్ స్టైలిష్ స్పై అవ‌తార్ లో విక్ర‌మ్ లుక్స్, యాక్ష‌న్ సీన్స్ ఈ సినిమా పై ఉన్న అంచ‌నాల్ని పెంచేలా క‌నిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్ లేటెస్ట్ మూవీ స్పెక్టార్‌లో మాదిరిగా కార్ ఛేజింగ్ ఎపిసోడ్స్ ఆడియెన్స్‌ను మెప్పించ‌డం ఖాయమ‌నే అనిపిస్తోంది. వెరసి ఓ అల్ట్రామోడ్ర‌న్ స్పై థ్రిల్ల‌ర్‌లో మిస్ట‌ర్ కేకేగా చియాన్ విక్ర‌మ్ అల‌రించ‌బోతున్నాడు. ఇక ఈ స్పై థ్రిల్ల‌ర్‌కి త‌గ్గ‌ట్లుగానే జిబ్రాన్ నేప‌థ్య సంగీతం, ‘Mr. కెకె’ లో ఉన్న విజువ‌ల్స్‌ని ఎలివేట్ చేసింది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియ‌న్స్‌ను ప్రేక్ష‌కులకి అందించ‌డానికి ద‌ర్శ‌కుడు రాజేష్ ఈ సినిమాను ఆద్యంతం అద్భుత‌మైన థ్రిల్లింగ్ స‌న్నివేశాలతో తెర‌కెక్కించిన‌ట్లుగా తెలుస్తోంది, అదే రేంజ్‌లో ట్రైల‌ర్ సైతం ఉండేలా జాగ్రత్త‌లు తీసుకున్నారు ద‌ర్శ‌కుడు. త‌న గ‌త సినిమా చీక‌టి రాజ్యంలో కూడా యాక్ష‌న్ నేప‌థ్యంగానే రూపొందించిన రాజేష్ మ‌రోసారి అదే పంధాను మిస్ట‌ర్ కేకే కు కొన‌సాగించారు. ట్రైల‌ర్‌తో ఫుల్ క్రేజ్ రాబ‌ట్టుకున్న ‘Mr. కెకె’ జూలై 19న మ‌రి ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.


from https://ift.tt/2RQohsO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages