Manmadhudu 2: అవంతిక, పద్ధతిగల అమ్మాయి.. బొంగేంకాదు! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 8 July 2019

Manmadhudu 2: అవంతిక, పద్ధతిగల అమ్మాయి.. బొంగేంకాదు!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా చిత్రంలోని రకుల్ ప్రీతి సింగ్ పాత్రను తాజాగా పరిచయం చేసింది. ఈ మేరకు చిన్న టీజర్‌ను వదిలారు. సినిమాలో రకుల్ పేరు అవంతిక. ఈ అమ్మాయిని చూసిన లక్ష్మి.. ‘అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్ధతి గల అమ్మాయి’ అని చాలా ఇష్టపడుతుంది. కానీ, వాస్తవానికి అవంతిక అంత పద్ధతి గల అమ్మాయేంకాదు. అల్లరి పిల్ల. మొదట ‘యు’ సర్టిఫికెట్ ప్రయోగిస్తుంది. పనికాకపోతే ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తుంది. అంతటి గడసరి. అలాంటి పిల్ల గురించి ‘ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సర్’ అని నాగార్జునతో వెన్నెల కిషోర్ అంటాడు. వెంటనే నాగార్జున ‘బొంగేంకాదు’ అని తీసిపారేస్తాడు. మొత్తం మీద ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. అవంతిక పాత్ర సినిమాకే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ‘ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్‌లు తట్టుకోలేవు’ అని నాగార్జునతో రకుల్ అనగానే ఆయన హావభావాలు భలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజస్, వియోకామ్ 18 స్టూడియో, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టూడియో కెనాల్ సహకారంతో కెవా మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్ మాటలు రాశారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి ప్రధాన తారాగణం.


from https://ift.tt/2YGAjaN

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages