Dear Comrade Download: డియర్ కామ్రేడ్ మూవీ ఆన్ లైన్‌లో.. దెబ్బకొట్టింది వాళ్లే! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 27 July 2019

Dear Comrade Download: డియర్ కామ్రేడ్ మూవీ ఆన్ లైన్‌లో.. దెబ్బకొట్టింది వాళ్లే!

సినిమా ఇండస్ట్రీని ఎన్నాళ్ల నుండో పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి తన ప్రతాపం చూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని పైరసీ భూతం గట్టి దెబ్బకొట్టింది. ఈ సినిమా శుక్రవారం నాడు (జూలై 26)న విడుదల కాగా.. ఈ మూవీ వస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉన్న యూనిట్‌‌కు తమిళ రాకర్స్ షాకిచ్చారు. ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లలో షోలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సినిమా హెచ్‌డీ రిజల్యూషన్‌తో క్వాలిటీ పైరసీ ప్రింట్‌ను తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో లీక్ చేశారు. ఎలాంటి సినిమానైనా ముందే లీక్ చేస్తామంటూ చెప్పి మరీ పైరసీకి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించారు. తమిళ రాకర్స్ కొత్త సినిమాలను పైరసీ చేయడం ఇదే తొలిసారి కాదు. విడుదలైన ప్రతి చిత్రాన్ని, విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను సైతం తమ వెబ్ సైట్‌లో లీక్ చేసి నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బకొడుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, ఇంగ్లీష్ భాషలకి చెందిన సినిమాలని పైరసీ చేసి ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తున్న ఈ ముఠాను యాంటీ పైరసీ సెల్ చట్టం కింద పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ వాళ్ల పాత అలవాట్లను మార్చుకోవడం లేదు. వీరికి పలు అంతర్జాతీయ పైరసీ ముఠాలతో సంబంధాలు ఉండటంతో యదేచ్ఛగా పైరసీకి పాల్పడుతున్నారు. తమిళ్ రాకర్స్ . కామ్ తరచూ డొమెయిన్ పేర్లు మార్చుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. .cc, Tamilrockers.to, Tamilrockers.pm, Tamilrockers.ws, Tamilrockers.lu, ఇలా పలు డొమెయిన్‌లతో కొత్త సినిమాలను లీక్ చేస్తున్నారు.


from https://ift.tt/2OilLNU

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages