Bumrah: బుమ్రా‌తో లవ్ ఎఫైర్.. అంతా బూమ్ అంటున్న అనుపమ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 10 July 2019

Bumrah: బుమ్రా‌తో లవ్ ఎఫైర్.. అంతా బూమ్ అంటున్న అనుపమ

‘ప్రేమమ్’ చిత్రంతో కుర్రహృదయాలను కొల్లగొట్టిన అనుపమ.. అఆ, శతమానం భవతి, క్రిష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ఈ బ్యూటీ.. టీం ఇండియా సంచలన బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాతో లవ్ ట్రాక్ నడుపుతుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి కారణం బూమ్రా.. అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో కావడంతో పాటు.. ఒకరి పోస్ట్‌లను ఒకరు షేర్ చేసుకుని లైక్స్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం 2019 వరల్డ్ కప్‌లో తన పదునైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తున్న బూమ్రా.. మలయాళ బ్యూటీ ఓరచూపులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో రూమర్స్ హల్ చల్ చేస్తుండటంతో.. వీటిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు అనుపమ. లవ్వూ లేదు గివ్వూ లేదు అంతా ట్రాష్ అని తేల్చేశారు అనుపమ. అసలు బూమ్రా.. ఒక క్రికెటర్‌గానే తప్ప.. అతను ఎవరు, ఏమిటి? అనే విషయం కూడా నాకు తెలియదు. వ్యక్తిగతంగా ఆయన నాకు పరిచయం లేదు. జస్ట్ ఫ్రెండ్‌గా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. అలాంటిది అతనితో లవ్, డేటింగ్ అంటూ ఏవేవో రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో నాకు అర్ధం కావడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే’ అంటూ రూమర్స్‌‌కి చెక్ పెట్టారు అనుపమ. అయితే బూమ్రా హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపిస్తున్నాడంటూ రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో రాశి ఖన్నాతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. హీరోయిన్లు, క్రికెట‌ర్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం ఈనాటిదికాదు… నాటి ప‌టౌడీ, ష‌ర్మిలా ఠాగూర్ నుంచి నేటి విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ దాకా ఎంద‌రో క్రికెట‌ర్లు హీరోయిన్ల‌తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్‌లో సౌరభ్ గంగూలీ, జడేజా, ధోనీ, రైనా, కేఎల్ రాహుల్, పాండ్యా ఇలా చాలా మంది క్రికెటర్లు హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించినట్టుగా చాలా వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు భారత యువ ఫాస్ట్ బౌలర్ బూమ్రా.


from https://ift.tt/32mzkPB

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages