‘గ్యాంగ్ లీడర్’ టీజర్: పెన్సిల్.. ఫేమస్ రివేంజ్ రైటర్! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 23 July 2019

‘గ్యాంగ్ లీడర్’ టీజర్: పెన్సిల్.. ఫేమస్ రివేంజ్ రైటర్!

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో వస్తున్నారు నేచురల్ స్టార్ నాని. కానీ, ఆ సినిమాలో గ్యాంగ్‌కు.. ఇప్పుడు మూవీలో గ్యాంగ్‌కు అస్సలు సంబంధంలేదు. ఐదుగురు ఆడవాళ్లు.. ఒక్కొక్కరిది ఒక్కో వయసు. చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు రకరకాల వయసుల వారు వీళ్లు. ఇలాంటి వాళ్లకు నాని ఎలా అయ్యారు.. వాళ్ల కోసం ఆయన ఏంచేశారు అనేదే సినిమా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను తీసుకొచ్చారు. ఈ సినిమాలో నాని రచయితగా కనిపించనున్నారు. ఆయన పేరు ‘పెన్సిల్’ పార్థసారథి. ఆయన పరిచయంతోనే టీజర్ మొదలైంది. ‘యస్.. యస్.. ఐ యామ్ ద పెన్సిల్! ఫేమస్ రివేంజ్ రైటర్. పెన్సిల్ పార్థసారథి’ అని నాని తనను తాను స్వయంగా పరిచయం చేసుకున్నారు. ‘‘ఈరోజు ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు. వాళ్ల ఏజ్‌లు, గెటప్‌లు చూస్తుంటే.. పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది. భలే ఉన్నారులే..!!’’ అంటూ నాని చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. టీజర్ మొత్తం చాలా కామెడీగా ఉంది. ఎవరిపైనో రివేంజ్ తీర్చుకోవడానికి ఆ లేడీస్ గ్యాంగ్ నానిని ఉపయోగించుకుంటుందని అర్థమవుతోంది. టీజర్‌లో ‘RX 100’ ఫేమ్ కార్తికేయ కూడా కనిపించారు. ఆయన ఫార్ములా వన్ రేసర్‌గా ఈ సినిమాలో నటించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తంగా చూసుకుంటే మంచి హిలేరియస్ రివేంజ్ డ్రామాను ఈ ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకులకు అందించనున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఆగస్టు 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from https://ift.tt/2Z95IDb

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages