‘తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నాడు’.. విదేశీయుడికి మంచులక్ష్మి ఫిదా - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 13 July 2019

‘తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నాడు’.. విదేశీయుడికి మంచులక్ష్మి ఫిదా

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటిగా మంచిపేరు తెచ్చుకున్నా భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఆమె ఎక్కడ మాట్లాడినా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. అయితే లక్ష్మి అవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. అసలు విషయానికొస్తే.. ఇటీవల అమెరికాలో ఇస్సాక్ రిచర్డ్ అనే అమెరికన్ తెలుగు బాగా మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మనవాళ్లేమో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే అతడేమో తెలుగులో మాట్లాడండి అంటూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై తాజాగా రిచర్డ్ స్పందిస్తూ ఓ వీడియో పోస్టు చేశాడు. ‘ అందరూ నన్ను న్యూజిలాండ్ వ్యక్తినని అనుకుంటున్నారు, కానీ నేను అమెరికనన్‌ని. 2016-18 మధ్య రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఏడాది వైజాగ్‌లో, మరో ఏడాది విజయవాడలో నివసించాను. అప్పుడే తెలుగు నేర్చుకున్నాను. అమెరికాలో ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే తెలుగు టూరిస్టులతో నేను తెలుగులోనూ మాట్లాడతా. ఓ రోజు తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి వీడియో తీసింది. నేను తెలుగు మాట్లాడటం గొప్ప విషయమా?. నా వీడియో ఎందుకు తీస్తున్నారని మొదట అనుకున్నాను. కానీ దానికి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలుగంటే చాలా ఇష్టం. నా గుండె ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో నా అనుభవాలను నా ఫేస్‌బుక్ ఫేజ్ ద్వారా మీతో పంచుకుంటాను’ అని ఇసాక్ రిచర్డ్ అన్నారు. ఈ వీడియోను దినేష్‌ ఆకుల అనే నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా మంచు లక్ష్మి దానిపై స్పందించారు. ‘అతడు నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు (స్మైలింగ్ ఎమోజీ). మన భాషను విదేశీయులు ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. మంచు లక్ష్మి ట్వీట్‌పై చాలామంది వెటకారంగా స్పందిస్తున్నారు. ‘ఈ వీడియోను ఎవరైనా నీకు ట్యాగ్ చేస్తారని భయపడి ముందుగా నువ్వే పోస్ట్ చేసేసుకున్నావ్ కదా అక్కా’ అని ఒకరు, అతడిని మెచ్చుకోకపోతే నువ్వు కూడా తెలుగు మాట్లాడటం నేర్చుకోవచ్చు కదా’ అని మరొకరు.. ఇలా మంచు లక్ష్మిని ఆడేసుకుంటున్నారు.


from https://ift.tt/2XLUgff

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages