మళ్లీ ప్రేమలో పడిన అమలాపాల్.. ఈసారి ఔట్‌సైడ్ సినిమా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 15 July 2019

మళ్లీ ప్రేమలో పడిన అమలాపాల్.. ఈసారి ఔట్‌సైడ్ సినిమా!

బోల్డ్ బ్యూటీ మరోసారి ప్రేమలో పడింది. ఈసారి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ‘ఆమె’ స్వయంగా చెప్పింది. గతంలో దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ ఆ తరవాత కొన్నేళ్లకు ఆయన నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారిస్తున్నానని అమలాపాల్ అంటోంది. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆమె’ సినిమా ఈనెల 19న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ చిత్రానికి మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా అమలాపాల్ స్వయంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అమలాపాల్‌ ముందు పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త ఎ.ఎల్.విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దీన్ని ఉద్దేశించి అమలాపాల్ మాట్లాడుతూ తాను కూడా ప్రేమలో ఉన్నానని చెప్పారు. ఆయన సినీ పరిశ్రమకు చెందినవారు కాదని వెల్లడించారు. ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి తన మాజీ భర్త మరోసారి ఒక ఇంటివాడు కావడంతో తన సీక్రెట్స్‌ను కూడా అమలాపాల్ బయటపెట్టారు. అయితే, తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు. కాగా, 2014లో ఎ.ఎల్.విజయ్, అమలాపాల్ వివాహం జరిగింది. మూడేళ్లపాటు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించిన వీరిద్దరూ.. 2017లో విడాకులు తీసుకున్నారు. ఎ.ఎల్.విజయ్ ఇటీవల డాక్టర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు.


from https://ift.tt/2Sh6dbO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages