దయచేసి హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని అనకండి.. నాకూ కుటుంబం ఉంది! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 30 July 2019

దయచేసి హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని అనకండి.. నాకూ కుటుంబం ఉంది!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు ముడిపెడుతూ యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తన ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ యూట్యూబ్ ఛానెళ్లను ఊర్వశి వేడుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఇలాంటి వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతారని పేర్కొంది. ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచిన ఊర్వశి.. ‘‘యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్స్‌కు నేను ఎంతో విధేయతతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి చెత్త వీడియోలను అప్‌లోడ్ చేయడం మానేయండి. నాకొక కుటుంబం ఉంది, వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ వీడియోలు నాకు సమస్యలు తెచ్చిపెడతాయి’’ అని పేర్కొన్నారు. ఒక సహాయం నిమిత్తం తన మాజీ ప్రియుడు, క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిశారని ఆ వీడియోలో ఉంది. ఇదొక హిందీ మీడియా సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్. కాగా, కిందటేడాది ఊర్వశి, హార్దిక్ పాండ్య ఒక పార్టీకి కలిసి వెళ్లారు. పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా ముంబైలోని తన బ్రీచ్ క్యాండీ హోమ్‌లో ఈ పార్టీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఈ పార్టీకి వచ్చాడు. అయితే, పార్టీలో హార్దిక్ పాండ్యతో ఊర్వశి సన్నిహితంగా మెలగడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం హార్దిక్ ‘మికీ వైరస్’ నటి ఎల్లి అవ్‌రామ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.


from https://ift.tt/2GBDoSG

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages