ప్రియదర్శి బైక్ చోరీ.. సినిమా ప్రమోషన్ కోసం ‘దొంగ’ నాటకాలు! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 8 July 2019

ప్రియదర్శి బైక్ చోరీ.. సినిమా ప్రమోషన్ కోసం ‘దొంగ’ నాటకాలు!

‘మల్లేశం’ హీరో, కమెడియన్ బైక్ చోరీకి గురైందంటూ వచ్చిన వార్త సోమవారం రాత్రి నుంచి బాగా వైరల్ అయ్యింది. తన ఇంటి ముందు ఉంచిన బైక్ చోరీకి గురైనట్టు ప్రియదర్శి వెల్లడించారు. ఈ మేరకు వీడియోను స్వయంగా ప్రియదర్శి ట్వీట్ చేశారు. ఇది సీసీటీవీ ఫుటేజ్ అంటూ పేర్కొన్నారు. ‘నా బైక్ చోరీకి గురైనప్పటి వీడియో ఫుటేజ్ ఇది! అక్కడ సీసీటీవీ ఉందని ఈ మనిషి కనీసం చూసుకోలేదు. వీడో నైపుణ్యంలేని దొంగ’ అని ప్రియదర్శి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నిజంగానే ప్రియదర్శి బైక్ చోరీకి గురైందని అనుకున్నారు. తెగ రీట్వీట్‌లు చేశారు. కొన్ని వెబ్‌సైట్లలో అయితే ప్రియదర్శి పోలీసులను ఆశ్రయించారని కూడా రాసేశారు. వాస్తవానికి ఇదొక ‘దొంగ’ నాటకం. హీరోగా, నిర్మాతగా వస్తోన్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ డ్రామా ఆడారు. ఇది విపరీతంగా వైరల్ కావడం, పరిస్థితి గాడి తప్పడంతో విషయాన్ని బయటపెట్టేశారు. ప్రియదర్శి తన ట్వీట్‌ను డిలీట్ చేసేశారు. ఆ తరవాత రంగంలోకి దిగిన సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘క్షమించండి, ఈ విషయంలో మేం అనుకున్నదానికంటే తీవ్రత ఎక్కువైంది. మేం నిర్మిస్తోన్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సరదాగా చేసినది. ఈ సినిమాలో ప్రియదర్శి నటించడానికి వీలుపడలేదు. అందుకే, ఆయన బైక్‌‌ను మా సినిమాలో ప్రత్యేకంగా పెట్టాం. ఈ బైక్ నడుపుతుంటే భలే ఉంది. లవ్ యూ దర్శి బోయ్’ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో అసలు విషయం బయటపడింది. అసలు ప్రియదర్శి ట్వీట్ చేసింది సీసీటీవీ వీడియోనే కాదు. అది కావాలని కెమెరాతో షూట్ చేసిన వీడియో. మొత్తానికి ‘నిను వీడని నీడను నేను’ సినిమాతో పాటు ప్రియదర్శి బైక్‌కు కూడా ఇప్పుడు మంచి ప్రచారం లభించింది. ప్రియదర్శి సైతం ఇలానే ఫీలవుతున్నారు. సందీప్ కిషన్ ట్వీట్‌కు ఆయన రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్స్ అన్న, ‘నిను వీడని నీడను నేను’తో నా బండికి కూడా బ్రేక్ ఇచ్చావ్’ అని పేర్కొన్నారు. కాగా, ‘నిను వీడని నీడను నేను’ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో థ్రిల్లర్‌ అంశాలతో వస్తోన్న ఈ మూవీతో సందీప్ కిషన్ నిర్మాతగా మారారు. వెంకటాద్రి టాకీస్ అనే బ్యానర్‌ను స్థాపించి వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అన్యాసింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. తమన్ సంగీత సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


from https://ift.tt/2S3GLWM

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages