AA19: రావు రమేష్ వదిలేసిన పాత్రలో హర్షవర్థన్.. ఇంతకీ గొడవేంటి? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 31 July 2019

AA19: రావు రమేష్ వదిలేసిన పాత్రలో హర్షవర్థన్.. ఇంతకీ గొడవేంటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఒక ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మేర తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేశారు. అయితే, కొన్ని కారణాల చేత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాల్షీట్ల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, రావు రమేష్‌కు మధ్య విభేదాలు రావడంతోనే ఆయన తప్పుకున్నారని అంటున్నారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోందట. ఈ సినిమాలో పాత్ర కోసం గతంలో రావు రమేష్ నుంచి వరుస తేదీలు దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్నారట. అయితే, ఈ తేదీల లోపల రావు రమేష్ షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేయలేదని టాక్. దీంతో మరోసారి ఆయన్ని చిత్ర యూనిట్ తేదీలు అడిగిందని అంటున్నారు. కానీ, రావు రమేష్ మరోవైపు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసం ఇప్పటికే తేదీలు ఇచ్చేశారట. ఇప్పుడు త్రివిక్రమ్ టీమ్ మరోసారి తేదీలు అడగడంతో రావు రమేష్ అసహనం వ్యక్తం చేశారట. తాను ఈ సినిమాలో చేయలేనని తప్పుకున్నారని తెలిసింది. వాస్తవానికి రావు రమేష్‌కు త్రివిక్రమ్ ఇప్పటి వరకు చాలా మంచి పాత్రలు ఇచ్చారు. కానీ, ఏ విధంగానూ తేదీలు సర్దుబాటు చేసుకోలేక రావు రమేష్ తప్పుకున్నారని సమాచారం. ఈ విషయంలో త్రివిక్రమ్ పట్ల రావు రమేష్ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారని అంటున్నారు. ఇక రావు రమేష్ స్థానాన్ని భర్తీ చేయడానికి వేట మొదలుపెట్టిన త్రివిక్రమ్.. ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో హర్షవర్థన్ నటన చూసి ఇంప్రస్ అయ్యారట. వెంటనే హర్షవర్థన్ సంప్రదించడంతో ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించారని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు రావు రమేష్‌తో చేసిన కొన్ని సన్నివేశాలను హర్షవర్థన్‌తో రీషూట్ చేయనున్నారని అంటున్నారు. చూద్దాం ఈ పాత్రను హర్షవర్థన్ ఎలా పండిస్తారో!


from https://ift.tt/2Kki7hc

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages