AA19: అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టేసిన బన్నీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 10 July 2019

AA19: అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టేసిన బన్నీ

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత కాస్త ఎక్కువగానే విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ ఇప్పుడు జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది వరసపెట్టి సినిమాలను ప్రకటించిన బన్నీ.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది బన్నీకి 19వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే అల్లు అర్జున్ తన పాత్రకు డబ్బింగ్‌ను మొదలుపెట్టేశారు. ఈ మేరకు గురువారం డబ్బింగ్ థియేటర్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను కూడా బన్నీ లైన్‌లో పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇక దిల్ రాజు నిర్మాతగా ‘ఐకాన్’ అనే మరో సినిమాలో బన్నీ హీరోగా నటించనున్నారు. త్రివిక్రమ్‌తో సినిమా అనంతరం సుకుమార్ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తరవాత ‘ఐకాన్’ను మొదలుపెడతారు. ఈ సినిమాకు ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.


from https://ift.tt/2JxgeNW

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages