‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో సంజయ్ దత్.. అధీరా ఫస్ట్‌లుక్ అదిరింది - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 29 July 2019

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో సంజయ్ దత్.. అధీరా ఫస్ట్‌లుక్ అదిరింది

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కిందటేడాది వచ్చిన ఈ శాండిల్‌వుడ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అనువాదమైంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సుమారు రూ.240 కోట్లు రాబట్టినట్లు లెక్కలున్నాయి. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వస్తోంది. తొలి భాగానికి మించి ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్థాయిని పెంచేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను రంగంలోకి దించారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (జూలై 29న) సంజయ్ దత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అధీరాగా సంజయ్ లుక్ అదిరిపోయింది. తన అధీరా లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంజయ్ దత్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో యశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధీరాగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే వెండితెరపై మహాబలుడిని చూస్తామంటూ హింట్ ఇచ్చారు. ఈ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, అధీరాగా సంజయ్ దత్ లుక్‌కి బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఫిదా అయిపోయారు. తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో సంజయ్ దత్ తొలి సినిమా ‘రాకీ’ షూటింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా నిలబడి చూడటం ఇప్పటికీ గుర్తుందని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత ఆయనతో కలిసి పనిచేస్తుండటం ఎంతో ప్రత్యేకమని వెల్లడించారు. సంజయ్ దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ను హిందీలో విడుదల చేస్తున్న నిర్మాతల్లో ఫర్హాన్ అక్తర్ కూడా ఒకరు. కాగా, ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తు్న్నారు.


from https://ift.tt/2Yc2OB6

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages