‘మన్మథుడు 2’ సిగరెట్ సీన్స్.. ట్రోల్స్‌పై స్పందించిన రకుల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 16 July 2019

‘మన్మథుడు 2’ సిగరెట్ సీన్స్.. ట్రోల్స్‌పై స్పందించిన రకుల్

కింగ్ నాగార్జున, జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలను పెంచడానికి ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ చిన్న టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు అవంతిక. ఈ అమ్మాయిలో రెండు కోణాలుంటాయి. ఒకటి సాఫ్ట్.. మరొకటి ఖతర్నాక్. ఈ ఖతర్నాక్ క్యారెక్టర్‌లో రకుల్ స్మోకింగ్ కూడా చేశారు. అయితే, రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ కాల్చడంపై ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని, సిగరెట్ కాలుస్తూ అమ్మాయిలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ వాయించేశారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా రకుల్ స్పందించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోన్న రకుల్ అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్‌పై మాట్లాడారు. ట్రోల్స్ తనను విసిగించాయని అన్నారు. ‘జనాల పనే చెప్పడం. వాళ్లు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇచ్చేటప్పుడు ‘కబీర్ సింగ్’ సినిమాను కూడా ప్రస్తావించారు. ‘కబీర్ సింగ్’ సినిమాలో షాహిద్ కపూర్ పాత్రకు, ఆయన నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సినిమాను సినిమాలా చూడాలని రీల్ క్యారెక్టర్స్‌ని రియల్ లైఫ్‌కు ముడిపెట్టకూడదని ప్రేక్షకులకు సూచించారు. మొత్తం మీద ఈ ట్రోల్స్ రకుల్‌ను బాగానే ఇబ్బంది పెట్టినట్టున్నాయి. కాగా, ప్రస్తుతం ‘మన్మథుడు 2’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శరవేగంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఆగస్టు 9న విడుదల చేయడానికి సినిమాను సిద్ధం చేస్తున్నారు.


from https://ift.tt/2LooiUt

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages