సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత సందడిగా ఉంటారో.. సోషల్ మీడియాలో అంతకు మించి అల్లరి చేస్తుంటారు. ఇక తన సోదరుడితో కలిసి అనుపమ చేసే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. అనుపమ పాటలు పాడుతూ, డ్యాన్సులు చేసే వీడియోలను షేర్ చేస్తుంటారు. తన మీద ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్ల మీదా స్పందిస్తుంటారు. ఇక అనుపమ సామాజిక సమస్యల మీద అప్పుడప్పుడూ గొంతెత్తుతుంటారు. తాజాగా మహిళల శరీరాకృతి, ఆడవారి మీద జరిగే వివక్ష గురించి రాసిన ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. మహిళలు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఇలా ఎలా ఉన్నా కూడా విమర్శలు చేస్తుంటారు. మహిళలు ఇళా ఉండాలి.. అలా ఉండాలి అని నిర్దేశిస్తుంటారు. లావుగా ఉంది, జీరో సైజులో లేదు.. కొలతలు సరిగ్గా లేవంటూ రకరకాలుగా విమర్శిస్తుంటారు. ఎక్కువగా తినకండి అని కొందరు.. మరీ అంత తక్కువగా తినకండి అని ఇంకొందరు.. లావుగా ఉండకండని మరి కొందరు ఇలా అడుగడునా ఆంక్షలు పెడతారంటూ వచ్చిన పోస్ట్‌లను అనుపమా షేర్ చేశారు. అలాంటి పోస్ట్‌లు అనుపమ షేర్ చేయడంతో ఇలాంటి వివక్షలకు తాను వ్యతిరేకం అని చెప్పేశారు. అనుపమ ఇలాంటి పోస్ట్ చేయడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. వివక్షపూరితమై కామెంట్లు చేసే వారిని మేల్కొపే విధంగా ఉన్న ఈ పోస్ట్‌లు నెట్టంట్లో వైరల్ అవుతున్నాయి. ఇక అనుపమ ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇప్పటికే 18 పేజిలు, కార్తికేయ 2 చిత్రాల్లో అనుపమ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఇంకో సినిమాను అనుపమ చేయబోతోన్నట్టు తెలుస్తోంది.
from https://ift.tt/3kKpxy8
No comments:
Post a Comment