లాక్ డౌన్ బ్రేక్ చేసిన హీరో... ప్రశంసిస్తున్న అభిమానులు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 3 April 2020

లాక్ డౌన్ బ్రేక్ చేసిన హీరో... ప్రశంసిస్తున్న అభిమానులు

తమిళ ప్రముఖ నటుడు లాక్ డౌన్‌ను బ్రేక్ చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని నిషేదాజ్ఞలు ఉన్నా అతడు బయటకు వెళ్లాడు. అయితే అందుకు కారణం వేరే ఉంది. తమిళనాడులో సీనియర్ జర్నలిస్ట్, రచయత నెల్లాయ్ భారతి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. అంత్యక్రియల కోసం భారతి భౌతికఖాయాన్ని పోరూర్ లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖుల ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై భారతికి తుది వీడ్కోలు పలికారు. భారతి.. అత్యంత సన్నిహితుడు కావడంతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కుటుంబానికి ఆర్థికసాయం చేయడంతో పాటు అంత్యక్రియల ఖర్చును కూడా ఆయనే భరించారు. లాక్‌డౌన్ ఉన్నా కూడా సన్నిహితుడి కడ చూపు కోసం వచ్చిన విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు.ఆయన అభిమానులు మా హీరో మనసున్న మారాజు అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు విజయ్ సేతుపతి తెలుగులో మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా మనకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. తాజాగా ఉప్పెన సినిమాకు సంబంధించి విజయ్ లుక్ కూడా విడుదలైంది. చేతిలో సిగరెట్ పట్టుకొని పంచెకట్టులో కూర్చిలో దర్జాగా కూర్చున్న విజయ్ సేతుపతి మాస్ లుక్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.... లాక్ డౌన్‌తో వాయిదా పడింది.


from https://ift.tt/34ginaQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages