ప్రియుడితో కలిసి హీరోయిన్ హాట్ అండ్ రొమాంటిక్ వర్క్ అవుట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 1 April 2020

ప్రియుడితో కలిసి హీరోయిన్ హాట్ అండ్ రొమాంటిక్ వర్క్ అవుట్స్

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. దీంతో సినీ తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సందర్భంగా తమలో ఉన్న రకరకాల టాలెంట్స్‌ను బయటకు తీస్తున్నారు. ఒకరు వంట చేస్తుంటే.. మరొకరు ఇంటి పని చేస్తున్నారు. ఇంకొందరు తోటపనులు చూస్తున్నారు. ఇలా ఎవరికివారు ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో టైమ్ పాస్ చేస్తున్నారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఏజ్ బార్ బ్యూటీ సుస్మితా సేన్.. మరోసారి ప్రియుడుతో కలిసి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే అందరిలా రొటీన్‌ వర్క్ అవుట్ ఫోటోస్ కాకుండా కాస్త రోమాంటిక్‌గా ప్లాన్ చేసింది ఈ భామ. తన బాయ్‌ ఫ్రెండ్ తో కలిసి చేసిన వర్క్‌ అవుట్ ఫోటోస్‌ ను తన ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్‌ సందర్భంగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోల్ని ఇన్ స్టా గ్రామ్‌లో సుస్మిత పోస్టు చేసింది. అంతేకాదు... కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు అంటూ తనదైన స్టైల్లో వేదాంతాన్ని కూడా చెప్పింది. ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ పిలుపునిచ్చింది. బాలీవుడ్‌ బ్యూటీ సుష్మిత తన కంటే చాలా చిన్నవాడైన రోమన్‌షాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్.. తనకన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రొహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. రొహమాన్ ఓ మోడల్. అయితే పిల్లలపై మమకారంతో రాణీ, అలీషా అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది సుస్మిత. అంతకుముందు కూడా వీరిద్దరూ కలిసి చేసిన వర్క్ అవుట్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పట్లో ఆ వీడియో కూడా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సుస్మిత రోహ్మన్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లి... అక్కడ వీరిద్దరూ కలిసి దిగిన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


from https://ift.tt/2R20lU4

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages