ఇంటి పనులు చేస్తున్న హీరో... ఫ్యాన్ తుడుస్తున్న వీడియో పోస్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 3 April 2020

ఇంటి పనులు చేస్తున్న హీరో... ఫ్యాన్ తుడుస్తున్న వీడియో పోస్ట్

‘ఉరి’ సినిమాతో ఆడియన్స్ మనసు దోచుకున్న హీరో . తెలుగులో ఈయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే లాక్ డౌన్‌తో సినీనటులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏంచక్కగా ఇంటి పనులు చేసుకుంటున్నారు. తాజాగా విక్కీ కౌశల్‌.. హాయిగా ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ను శుభ్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోలను శుక్రవారం అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేగాక ఈ వీడియోలో 'ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ ఏం అవసరమా' అని చెబుతున్నాడు. క్వారంటైన్‌ లైఫ్‌' అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోను చూసిన విక్కీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాము ఆరాధించే హీరో యాక్టింగ్‌ మాత్రమే కాకుండా ఇలాంటి పనులు కూడా చక్కగా చేస్తున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. విక్కీ కౌశ‌ల్‌, అందాల భామ క‌త్రినా కైఫ్ మ‌ధ్య సమ్ థింగ్ ఉందంటూ బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాల‌పై స్పందించిన విక్కీ త‌న ఫ‌స్ట్ ల‌వ్ క‌త్రినా కాద‌ని తేల్చేశాడు. హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అందాల న‌టి మాధురీ దీక్షిత్ అంటే తనకు ఎంతో ఇష్ట‌మంటూ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఎలా ఉప‌యోగించుకుంటున్నార‌న్న ప్ర‌శ్న‌కు కుటుంబంతో గ‌డుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడ‌ప్పుడు అమ్మ‌తో యోగా, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నాన‌న్నాడు. కరోనాపై పోరుకు తాజాగా విక్కీ కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించాడు. 2015లో 'మాసాన్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన విక్కీ కౌశల్‌.. రాజీ, లస్ట్‌ స్టోరీస్‌, సంజు వంటి హిట్‌ చిత్రాల్లోనటించారు. కాగా గతేడాది విక్కీ కౌశల్‌ నటించిన ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఉరి దర్శకుడు ఆదిత్య ధార్‌ తెరకెక్కించనున్న మరో సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో మహాభారతంలోని ఆశ్వత్థామా పాత్రలో విక్కీ నటించనున్నాడు.


from https://ift.tt/2UERU3u

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages