ఇంట్లో సింపుల్‌గా కొడుకు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన బన్నీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 3 April 2020

ఇంట్లో సింపుల్‌గా కొడుకు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన బన్నీ

చిన్న పిల్లల పుట్టినరోజులు తల్లిదండ్రులకు పండగలాంటిదే. కొత్తబట్టలు కొని, వాళ్లతో కేక్ కట్ చేయించి, పిల్లలందరికీ చాక్లెట్లు పంచి ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుకను జరుపుకుంటారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు కూడా మూతబడ్డాయి. దీంతో పిల్లల పుట్టినరోజు వేడుకలకు దూరమవుతున్నారు. అమ్మానాన్నలతోనే ఇంట్లో సింపుల్‌గా పాయసం తాగి ఊరుకుంటున్నారు. కొంత మంది ఇంట్లోనే చిన్న కేక్ తయారుచేసుకుని పిల్లలతో కట్ చేయిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు కూడా ఇలానే చేశారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు నేడు. అయాన్ ఆరో ఏట అడుగుపెట్టాడు. కుమారుడు బర్త్‌డేను గ్రాండ్‌గా నిర్వహించే అవకాశం లేక ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేశారు బన్నీ. ఇంట్లో చేసిన కేక్‌ను కొడుకుతో కట్ చేయించారు. ఈ ఫొటోలను అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రేమ అంటే ఏమిటి?? అని నేను నా జీవితం మొత్తం ఆలోచించాను. గతంలో చాలా సార్లు గొప్ప భావాలను నేను ఆస్వాదించాను.. కానీ, అది ప్రేమో కాదో నాకు తెలీదు. కానీ, నువ్వ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది. నువ్వే నా ప్రేమ. ఐ లవ్ యూ అయాన్. హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు అల్లు స్నేహారెడ్డి ‘‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అని అయాన్ కేక్ కట్‌చేస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అయాన్‌తో పాటు బన్నీ, స్నేహారెడ్డి, అర్హ కూడా ఉన్నారు.


from https://ift.tt/344ZOpM

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages