హిందూ దేశాల్లో సైతం లేని విధంగా వినాయకుడి బొమ్మను ఓ ముస్లిం దేశం ఏకంగా తన కరెన్సీపై ముద్రించుకుంది. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ, ఇది నిజం. హిందూ దేవుళ్లను ఎక్కువగా ఆరాదించే భారత్, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇలాంటి సాంప్రదాయం లేదు. కానీ, ఇండోనేసియా మాత్రం కరెన్సీ నోటుపై మీదే గణేశుడి బొమ్మ ముద్రించింది. ఎలాంటి సంబంధం లేని ముస్లిం దేశం కరెన్సీ నోటు మీద మన బొజ్జ గణపయ్యను ముద్రిస్తున్నారంటే వారికి ఈయన అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ కూడా ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచంలో వినాయకుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేసియా’’ అని ట్వీట్ చేశారు. Must Read: ఇండోనేషియాలో 20 వేల కరెన్సీ నోటు మీద స్వాతంత్ర్య సమరయోధుడు హజార్ దేవంతరా చిత్రం ఉంటుంది. దాని పక్కనే వినాయకుడి బొమ్మ కూడా ముద్రించారు. ఇండోనేసియాలో హిందువుల జనాభా కేవలం 1.7 శాతం మాత్రమేర. అక్కడ ముస్లింలు 87.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు ఆ దేశంలో హిందువుల ఆలయాలు, విగ్రహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా ఈ నోటుని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. Must Read: Must Read:
from https://ift.tt/3gmpl2r
No comments:
Post a Comment