నా పెళ్ళానికి విడాకులిచ్చేస్తా.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన.. ఎంటరైన శ్రీముఖి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

నా పెళ్ళానికి విడాకులిచ్చేస్తా.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన.. ఎంటరైన శ్రీముఖి

అయ్యో అయ్యో.. నా పెళ్ళాం బాధ భరించలేకపోతున్నా అంటూ సహాయం కోరాడు జబర్దస్త్ కమెడియన్ అవినాష్. ఇంకెవ్వరినైనా పెళ్లి చేసుకుంటా కానీ అది మాత్రం నాకొద్దండీ అంటూ ఆవేదన చెందాడు. ఈ మేరకు షర్ట్ బటన్స్ విప్పి తన భార్య పెట్టిన బాదితపూజను శ్రీముఖికి చూపించాడు. ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయింది మన బుల్లితెర రాములమ్మ. వెంటనే నేనున్నానుగా.. మీ సమస్య తీర్చేస్తా అంటూ అతని భార్యను పిలిపించింది శ్రీముఖి. తీరా చూస్తే అవినాష్ భార్యగా యాంకర్ విష్ణుప్రియ ఎంటరైంది. లాక్‌డౌన్ కారణంగా తమన్నా దినానికో వీడియో పెడుతున్నారు. మరి మగవాళ్లకు నేనే తమన్నా కాబట్టి గంటకో టిక్ టాక్ వీడియో చేస్తుంటే నా మొగుడు అడ్డుపడుతున్నాడని ఆమె చెప్పింది. వాడిని వాతలొచ్చేలా కాదు తోలు వలిచేలా కొట్టాలి అంటూ ఫైర్ అయింది. శ్రీముఖి ముందే అవినాష్- విష్ణు ప్రియ ఇద్దరూ ఒకరిపై ఒకరు చెడామడా వాయించుకున్నారు. ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన శ్రీముఖి ఓ తీర్పు ఇచ్చి ఆ గొడవకు ముగింపు పలికింది. ఈ గొడవ సంగతేమో గానీ, ఇదేంటి! అవినాష్- విష్ణు ప్రియ భార్యాభర్తలా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో జబర్దస్త్ ప్లాన్ చేసిన శ్రీముఖి.. అవినాష్- విష్ణు ప్రియల చేత భార్యాభర్తల వేషం కట్టించింది. అది కూడా ఓ ప్రోగ్రాం కోసం. ఎవరి ఇంట్లో వారినే ఉంచి 'బతుకు బలైపోయిన బండి' అంటూ ఓ స్ఫూఫ్ వీడియో రూపొందించి జనాన్ని కడుపుబ్బా నవ్వించింది. ఈ 'బతుకు బలైపోయిన బండి' వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ''క్వారంటైన్ అనుభవం! ఇంట్లో నుంచి పనిచేయడం అంత సులువేం కాదు. ఈ పిచ్చి చూడండి'' అని పేర్కొంది శ్రీముఖి. తన మార్క్ కామెడీతో అలరిస్తూనే భార్యభర్తలిద్దరు కలిసి పని చేసుకుంటే ఎలాంటి గొడవలు రావనే సందేశమిచ్చింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.


from https://ift.tt/2wGXedl

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages