మూడు రాజధానులు: జగన్‌పై నటి షకీలా పంచ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 2 February 2020

మూడు రాజధానులు: జగన్‌పై నటి షకీలా పంచ్

రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను సినిమాల్లో పంచ్‌లుగా గట్టిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ మూడు రాజధానులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే టాపిక్‌పై జగన్‌కు పంచ్ వేశారు నటి . ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’. వి.ఎన్ సతీష్ దర్శకత్వం వహించారు. నిన్న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. షకీలా పేపర్ చదువుతూ.. ‘ఆంధ్రాకి మూడు రాజధానులు’ అని పేపర్‌లో రాసిన వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోవడంతో టీజర్ మొదలైంది. ‘ఆంధ్రాకి మూడు రాజధానులేంటి?’ అని తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. ఇందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ.. ‘అవును మేడమ్. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అంటాడు. ఇందుకు షకీలా.. ‘ఒక్క స్టేట్‌కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు’ అని పంచ్ వేశారు. ఈ సినిమాలో విక్రాంత్; పల్లవి ఘోష్ జంటగా నటించారు. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సతీష్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. READ ALSO: సినిమాను కాస్త కొత్తగా తీయాలని ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని తెలిపారు. అయితే ఇప్పటివరకు సెన్సార్ బోర్డు తాను నటించిన, నిర్మించిన ఏ ఒక్క సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇంకా తనను అడల్ట్ స్టార్‌గానే చూస్తున్నారని షకీలా బాధపడ్డారు. ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబకథా చిత్రం’ సినిమాలో మాత్రం ఎలాంటి వల్గారిటీ లేదని, కానీ ఈ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలుపుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.


from https://ift.tt/2u46My0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages